తెలంగాణా సమస్య ఫై కాంగ్రెస్ అనుకున్న డెడ్లైన్ దగ్గర పడుతున్న కొద్ది రకరకాల వాదనలను వినిపిస్తున్నారు మన నాయకులు. ఈ సారి మళ్లీ జగ్గా రెడ్డి వంతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగదని, తెలంగాణ రాదని, ఈ విషయం టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు తెలుసాని సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని అన్నారు. ఒకవేళ విడిపోతే మూడు రాష్ట్రాలు చేయాలని, హైదరాబాద్‌ను కొత్తగా రాష్ట్రంగా చేసి సంగారెడ్డితో పాటు హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను అందులో కలపాలని ఆయన కోరారు. హైదరాబాద్‌ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న హైదరాబాద్ కు చెందిన మంత్రులు దానం, ముఖేష్‌లకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: